తిరుమల తిరుపతి దేవస్థానముల ఉత్సవముల పట్టిక

శ్రీ పరాభవ నామ సంవత్సర విశేషాలు & ఉత్సవాలు

ఆషాఢ మాసము 15-07-2026 నుండి 12-08-2026 వరకు విశేష ఉత్సవాలు
తేదీ వారం వివరాలు
15-07-2026 బుధవారం చంద్రోదయం గురుమౌఢ్యారంభం రా. 2-44
16-07-2026 గురువారం జగన్నాథ రథయాత్ర
17-07-2026 శుక్రవారం కర్కాటక సంక్రమణము ఉ. 11-53, దక్షిణాయనం ప్రారంభం,
తిరుమల శ్రీవారి ఆణివార ఆస్థానం,
తిరుమల శ్రీవారి పుష్పపల్లకి సేవ,
శ్రీనివాసమంగాపురంశ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవ ప్రారంభం
18-07-2026 శనివారం మరీచి మహర్షి వ.తి.న.
19-07-2026 ఆదివారం శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవ సమాప్తి.
20-07-2026 సోమవారం పుష్యమి కార్తె ప్రా. రా. 12-14
22-07-2026 బుధవారం తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారు అహోబిల మఠం లోనికి వేంచేయుట
24-07-2026 శుక్రవారం తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం,
తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివార్ల బ్రహ్మోత్సవ అంకురార్పణ
25-07-2026 శనివారం తొలి ఏకాదశి శయనైకాదశి
తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి పవిత్రోత్సవాలు అంకురార్పణ
తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివార్ల బ్రహ్మోత్సవ ప్రారంభం
26-07-2026 ఆదివారం నారాయణగిరిలో ఛత్రస్థాపనము, తులసి మహాత్మ్యం,
తిరుమలలో శ్రీవారి ఆస్థానం, తిరుపతి శ్రీ విఖనాసాచార్యులవారి ఉత్సవారంభం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్ఠాభిషేకం సమాప్తి.
28-07-2026 మంగళవారం తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి పవిత్రోత్సవాలు సమాప్తి.
29-07-2026 బుధవారం వ్యాసపూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ,
గురుపూర్ణిమ, మహాషాఢీ
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగ మహోత్సవ అంకురార్పణ.
30-07-2026 గురువారం తిరుపతి శ్రీ విఖనాసాచార్యులవారి శాత్తుమొఱ.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగ మహోత్సవం
02-08-2026 ఆదివారం తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివార్ల బ్రహ్మోత్సవ సమాప్తి
03-08-2026 సోమవారం తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివార్ల పుష్పయాగం
05-08-2026 బుధవారం ఆండాళ్ తిరువాడిప్యూరం ఉత్సవారంభం
07-08-2026 శుక్రవారం ఆడి కృత్తిక,
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవ ప్రారంభ అంకురార్పణ
09-08-2026 ఆదివారం మతత్రయ ఏకాదశి
10-08-2026 సోమవారం తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవ సమాప్తి
11-08-2026 మంగళవారం మాసశివరాత్రి
12-08-2026 బుధవారం గురుమౌఢ్యత్యాగము ఉ. 7-29, చక్రత్తాళ్వారు వ.తి.న., ప్రతివాది భయంకర అణ్ణంగాచార్య వ.తి.న.
    తదుపరి శ్రావణం మాసము ప్రారంభం